తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లబుండ తెలుగొకండ
ఎల్ల నృపులు పొగడ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
అని శ్రీకృష్ణ దేవరాయలచే గౌరవ మర్యాదలు పొందినా… ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని విదేశీ యాత్రికులచే పొగడ్తలు అందుకున్నా తెలుగు భాషకే చెల్లింది. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- క్రీస్తు పూర్వం 400BCE నుండి వెలుగొందుతున్న అతి కొద్ది ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి.
- నాగబు: దీనిని తొలి తెలుగు పదంగా భాషావేత్తలు పేర్కొంటూ ఉంటారు. అయితే దీనిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. వీటిని పక్కన పెడితే, ఈ పదం మనకు అమరావతిలోని స్తూపం దిబ్బల్లో దొరికింది.
- తెలుగు మాట్లాడటం వల్ల మానవ శరీరంలోని 72వేల న్యూరాన్లు శక్తిమంతం అవుతాయని ఒక పరిశోధనలో తేలింది. ఏ ప్రపంచ భాషకు ఇంత శక్తి లేదని చెబుతుంటారు.
- ఒక్క భారతదేశంలోనే కాదు, పొరుగున ఉన్న శ్రీలంక, మయన్మార్, మారిషస్, మాల్దీవుల్లో తెలుగు ప్రజల సంఖ్య అత్యధికంగా ఉంది.
- తెలుగును అజంతా భాష అని భాషావేత్తలు ముద్దుగా పిలుస్తుంటారు. ప్రతీ పదం అచ్చులతో (vowel) అంతమయ్యే ఏకైక భాష తెలుగు కావడమే దీనికి కారణం.
- ఎంత తక్కువగా లెక్కలు వేసి చెప్పుకున్నా ఆంధ్రులకు 2వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నన్నయ్య మహాభారతంతో తెలుగు సాహిత్యం ప్రారంభమైందని కొందరు చెపుతున్నప్పటికీ, అంతకు ముందు నుండే తెలుగులో సాహిత్యం విలసిల్లిందని ఆయా ప్రాంతాల్లో దొరికిన శిలా శాసనాలను బట్టి తెలుసుకోవచ్చు.
- మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అలనాటి ఆంధ్రులు గొప్ప వీరులుగా, యుద్ధ నిపుణులుగా పేరొందారు. కురు పాండవ యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన నిలిచి పోరాడారు.
- 1960 వరకు మలేసియా, శ్రీలంక, మయన్మార్, మారిషస్, మాల్దీవుల్లో తెలుగు పాఠశాలలు ఉండేవి. కాలక్రమేణా అవి మూతబడ్డాయి. తమిళనాడులో స్థిరపడిన లక్షలాది తెలుగువారికి మాదిరిగానే ఆయా దేశాల్లో స్థిరపడిన తెలుగు సంతతి ప్రజలు తమను తాము ఆంధ్రులని మరిచిపోయారు.
- తెలుగు జనాభా మొత్తం కలిపితే అది ఫ్రాన్స్ దేశ జనాభాకన్నా అత్యధికం.
- బర్మా దేశపు తొలి రాజ్యాంగ (1948) రచయిత ఒక తెలుగు సంతతి వ్యక్తి.
- మన దేశంలో ఆరు ప్రాచీన భాషల్లో ఒకటిగా తెలుగును ప్రభుత్వం గుర్తించింది.
- బాలీవుడ్ తరువాత దేశంలో రెండో అతిపెద్ద చిత్ర పరిశ్రమగా తెలుగు చిత్రపరిశ్రమ పేరొందింది.
తెలుగు లిపి ఆయా కాలాల్లో ఎలా ఉండేది.. చివరకు ఎలా స్థిరపడిందో వివరించే చిత్రం దిగువున గమనించండి.
Written by : Administrator
February 20, 2018 — magnon
February 20, 2018 — magnon